భక్తులతో కిటకిటలాడిన మహానంది పుణ్యక్షేత్రం

56చూసినవారు
మహానంది పుణ్యక్షేత్రంలో కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుండి దర్శనాలు, పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. క్షేత్రానికి వచ్చిన భక్తులు కోనేరులలో పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయ పరిసరాల్లో కార్తిక దీపాలు వెలిగించారు. తదనంతరం శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్లలో అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్