శ్రీశైలంలో లోక కళ్యాణం కోసం గురువారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ పల్లకి ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూల నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) జరిపిస్తారు. ఈ వేడుకలో భాగంగా ముందుగా గణపతి పూజ చేసి శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలో పల్లకీ లో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. ఈ వేడుకలో దేవస్థానం ఈవో పెద్దిరాజు పాల్గొన్నారు.