ఎమ్మిగనూరు మండలం రాళ్ల దొడ్డికి చెందిన కటికే చాంద్ భాషా హుస్సేన్ బి దంపతులకు ఇద్దరు కూతుర్లు ఓ కొడుకు ఉన్నారు.హోటల్లో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని చాంద్ భాషా పోషించుకుంటున్నాడు.పెద్దకూతురు అస్మత్ బి (9) వింత వ్యాధితో బాధపడుతుంది.ఆమె లేవలేదు కూర్చోవలేదు. స్తోమతకు మించి వైద్యుల వద్ద చూపించిన వ్యాధి నయం కాలేదు. తిరుపతిలో వైద్యులు మూడు నెలల తర్వాత శస్త్ర చికిత్స చేస్తామన్నారు. అయితే తమను ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.