ఎమ్మిగనూరు ఏపీఎస్ఆర్టీసీ డిపో నుంచి కర్నూల్ కు ప్రతిరోజు సింగిల్ స్టాప్ సర్వీసులను నడిపేవారు. వాటిలో కోడుమూరు ఒక స్టాఫ్ ఉండేది. నేటి నుంచి సింగిల్ స్టాప్ కు బదులు డబుల్ స్టాఫ్ సర్వీసులను ప్రారంభించనున్నారు. దీంతో గోనెగండ్ల కోడుమూరులో బస్సులో ఆగుతాయని ఎమ్మిగనూరు డిపో మేనేజర్ అమర్నాథ్ బుధవారం తెలిపారు. ఈ అవకాశాన్ని గోనెగండ్ల మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.