నెల్లూరు జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిలంలో లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా దిగువ అహోబిలంలో రథోత్సవం నిర్వహించారు. ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను విశేషంగా అలంకరించి రథంపై కొలువుదీర్చారు. అహోబిలం మఠం పీఠాధిపతి రంగనాథ యతేంద్ర, మహా దేశికన్ రథం వద్ద ఆలయ మర్యాదల ప్రకారం పూజలు నిర్వహించగా భక్తులు స్వామి వారి రథాన్ని ముందుకు కదిలించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.