అనుమాస్పద స్థితిలో వ్యక్తి మృతి

35542చూసినవారు
అనుమాస్పద స్థితిలో వ్యక్తి మృతి
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలంలోని చెట్టిసముద్రంలో, ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. గ్రామ సమీపంలోని పొలాల్లో మృతదేహం పడి ఉన్న సమాచారాన్ని స్థానికులు, పోలీసులకు అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం స్థితిని చూస్తే, రెండు మూడు రోజుల క్రితం చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు.

మృతదేహం పూర్తిగా ఊడిపోయి ఉంది. మృతదేహం ఇక్కడికి ఎలా వచ్చింది. లేదా ఆత్మహత్య చేసుకున్నాడా? మరేదైనా కారణమా అనే అనుమానాలు రావడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ సంఘటన నగరంలో కలకలం రేపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్