‘అవని చతుర్వేది’ 2018లో మిగ్-21లో ఒంటరిగా ప్రయాణించిన మొదటి భారతీయ మహిళా ఫైటర్ పైలట్. భావనా కాంత్, మోహనా సింగ్ జితర్వాల్‌లతో పాటు, భారత వైమానిక దళంలో చేరిన మొదటి మహిళా పోరాట పైలట్‌గా అవని చతుర్వేది నిలిచారు. విమానాన్ని వేగంగా టేకాఫ్, ల్యాండింగ్ అత్యధికంగా చేసిన మహిళగా ఈమెకు గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే ఆమె మిగ్-21లో ఒంటరిగా ప్రయాణించారు.