హిందీ వివాదంపై స్పందించిన విజయ్‌

73చూసినవారు
డీఎంకే, కేంద్ర ప్రభుత్వాల మధ్య హిందీ భాష విషయంలో వివాదం కొనసాగుతోంది. దీనిపై తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్‌ తాజాగా స్పందించారు. ‘‘డీఎంకే, బీజేపీ రెండూ పెద్ద పార్టీలైనా సామాజిక మాధ్యమాల్లో హ్యాష్‌ట్యాగ్ గేమ్స్‌ ఆడుకుంటున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. వారి వివాదం చిన్నపిల్లల కొట్లాటలా ఉంది’’ అని ఎద్దేవా చేశారు. ‘గెట్‌ఔట్‌’ హ్యాష్‌ట్యాగ్‌ పెట్టి వారిని ఇంటికి సాగనంపాలన్నారు.

సంబంధిత పోస్ట్