ప్రపంచానికి మరో వైరస్ ముప్పు పొంచి ఉంది. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన కొన్నేళ్లకే, కాంగోలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే 53 మంది ఈ వైరస్‌తో చనిపోయినట్లు కాంగో ప్రకటించింది. ఈ వైరస్ సోకిన 48 గంటల్లోనే మరణాలు సంభవిస్తున్నట్లు కాంగో అధికారులు తెలపడంతో ప్రపంచదేశాల్లో ఆందోళన మొదలైంది. ‘ఈ వైరస్ ప్రజారోగ్యానికి ఒక ముఖ్యమైన ముప్పు.. అప్రమత్తం కావాలి’ అంటూ WHO సైతం ప్రకటించింది.