అనంతసాగరం మండలం ముస్తాపురంలోని లిటిల్ ఏంజిల్ పాఠశాలలో విద్యార్థిని స్టడి గురించి ఆరా తీసిన విద్యార్థిని తండ్రి (బుజ్జి రెడ్డి) పై కరస్పాండెంట్ మల్లి కార్జున్ , యాజమాన్యం దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే సోమవారం బుజ్జి రెడ్డి భార్య నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ కృష్ణ కాంత్ ను కలిసి యాజమాన్యం తమను బెదిరిస్తున్నారని, న్యాయం చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు.