ఆపదలో ఉన్న వారికి డాక్టర్ ప్రణీత్ చౌదరి చేయూత

2392చూసినవారు
ఆపదలో ఉన్న వారికి డాక్టర్ ప్రణీత్ చౌదరి చేయూత
ఆత్మకూరు పట్టణంలోని జ్యోతి నగర్ కి చెందిన కర్ర నాగరాజు - పద్మ ఇద్దరు పిల్లలతో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సంగం బీరా పేరు వాగు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని చిదిమేసింది. ఆ ప్రమాదంలో ఇంటి పెద్ద దిక్కైన తల్లిదండ్రులు, కుమార్తె గల్లంతయ్యారు. చివరికి ఆ కుటుంబంలో బాలుడు నవదీప్ మిగిలాడు. గల్లంతైన తల్లిదండ్రులు తిరిగి వస్తారని నవదీప్పెట్టుకున్నా ఆశలు నిరాశఅయ్యాయి. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కలిచి వేస్తుంది.

ఈ విషయాన్ని తెలుసుకున్న ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి, ఆత్మకూరు పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల ఎండీ డాక్టర్ ప్రణీత్ చౌదరి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించి ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమ వంతుగా రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని చెక్కు ద్వార హాస్పిటల్ చాంబర్లో మంగళవారం బాధితుడు నవదీప్ కు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రణీత్ చౌదరి మాట్లాడుతూ... రోడ్డు ప్రమాదంలో బాలుడు కుటుంబ సభ్యులను కోల్పోయిన సంఘటన తన మనసును కలచివేసిందని అలాగే భవిష్యత్తులో బాలుడికి తమ వంతుగా అండగా ఉంటామన్నారు.


ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి, ఏఐఎమ్ జిల్లా లీగల్ అడ్వైజర్ న్యాయవాది నంద ఓబులేసు, ఐక్య ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ పయ్యావుల మారుతినాయుడు, డాక్టర్ కుమార్, సురేష్ చౌదరి, పవన్ హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్