బాలయ్యపల్లి - Balayyapalli

వికారాబాద్ జిల్లా
కొండా విశ్వేశ్వర్ రెడ్డి బయోగ్రఫీ
May 08, 2024, 01:05 IST/

కొండా విశ్వేశ్వర్ రెడ్డి బయోగ్రఫీ

May 08, 2024, 01:05 IST
కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి 26 ఫిబ్ర‌వ‌రి 1960లో జ‌న్మించారు. ఆయ‌న ఇంజ‌నీరు, పారిశ్రామిక‌వేత్త‌, రాజ‌కీయ‌వేత్త. తెలంగాణ‌లోని చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు. 2014లో తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ త‌ర‌ఫున నిలిచి ఎన్నిక‌ల్లో గెలిచారు. రంగారెడ్డి జిల్లా ఎవ‌రి పేరు మీద ఏర్పాటైందో తెలుసుగా కొండా వెంక‌ట రంగారెడ్డి ఆయ‌న మ‌న‌వ‌డే కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి. కొండా విశ్వ‌శ్వ‌ర‌రెడ్డికి ఆవిష్క‌ర‌ణ‌ల‌న్నా, తిరిగి ఉప‌యోగించ‌గ‌లిగే శ‌క్తి వ‌న‌రుల‌న్నా, వ్య‌వ‌సాయంలో సాంకేతిక ఉప‌యోగం లాంటివాటిపైన మ‌క్కువ ఉండేది.కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి ఎంపీ ప‌ద‌విలో ఉండ‌గానే అమెరికా పేటెంట్ వ‌రించింది. బ‌హుశా ఇలాంటి అరుదైన గౌర‌వం ఆయ‌న ఒక్క‌డికే చెల్లుతుందేమో. 2018 లో కోర్ట్ ఆఫ్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ కు ఆయ‌న స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.2014 లో విద్యుత్‌, పునరుద్ధ‌ర‌ణ శ‌క్తి వ‌న‌రుల మంత్రిత్వ‌శాఖ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటైన స‌ల‌హా సంఘం క‌మిటీలో ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు. 2014లో ప‌రిశ్ర‌మ‌ల కోసం ఏర్పాటు చేసిన స్టాండింగ్ క‌మిటీలో ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు.2014లో ప్ర‌త్యేక హ‌క్కుల సాధ‌న కోసం ఏర్పాటు చేసిన క‌మిటీకి ఆయ‌న స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రించారు.2014లో16వ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ అభ్య‌ర్థిగా నిలిచి గెలుపొందారు.