స్వర్ణముఖి పొర్లుకట్టకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

57చూసినవారు
స్వర్ణముఖి పొర్లుకట్టకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెంలో గత సంవత్సరం వచ్చిన భారీ వరదలకు స్వర్ణముఖి పొర్లు కట్టలు తెగిపోవడంతో ఈ పొర్లు కట్ల మరమ్మతులకు శనివారం గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సునీల్ కుమార్ మాట్లాడుతూ రూ.1.75కోట్ల మరమ్మతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్