కందుకూరులోని గ్రామదేవత అంకమ్మ తల్లి అలంకరణ కోసం నూతనంగా తయారు చేయించిన స్వర్ణ కవచం, స్వర్ణ మరకత తోరణం ఆభరణాలను ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు శుక్రవారం ఉదయం 9 గంటలకు భక్తుల సమక్షంలో సమర్పిస్తారని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృష్ణవేణి గురువారం తెలిపారు. అమ్మవారికి ఆభరణాలు సమకూర్చడానికి సహాయం అందించిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే మానుగంటి మహేందర్ రెడ్డి కి ఆమె ధన్యవాదాలు తెలిపారు.