కందుకూరు పట్టణంలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, పాదచారులు, చిన్న వ్యాపారస్తులు, ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. అకాల వర్షం కారణంగా నారుమడులు పోసిన రైతులు కూడా ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షపు నీరు చెరువులను తలపిస్తుంది. ఈ నేపథ్యంలో మరో రెండు రోజులు వర్షం కొనసాగే అవకాశం ఉంది.