జిల్లా కలెక్టర్ ను కలిసిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా ని, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.