కందుకూరు: సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

84చూసినవారు
కందుకూరు: సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
కందుకూరు ఎంపీడీవో కార్యాలయంలో పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుకూరులో ఉన్న సమస్యల గురించి అధికారులతో చర్చించారు. నీరు, రోడ్లు, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్