నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలోని కోవూరు, పందలపాడు గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మండల వ్యవసాయాధికారి వీ. రాము ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతు మినుము, వరి, పొగాకు, మిరప పంటలలో నీరు నిలపకుండా కాలువలు తీసుకుని నీటిని బయటకు పంపాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు సూచనలు పాటించినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చునని తెలిపారు.