ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాని, కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు సోమవారం కలిశారు. కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న నూతన హైవే 167బికు ప్రభుత్వం భూ సేకరణ చేయడం జరిగింది. పట్టణానికి దగ్గరగా భూములు కలిగి ఉన్న రైతులకు చెల్లించే నష్టపరిహారం విషయంలో రైతులకు అన్యాయం జరిగిందని రైతులు అర్జీలు అందజేశారని ఎమ్మెల్యే కలెక్టర్ కు తెలిపారు. విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.