కందుకూరు పట్టణంలోని పడమటి బలిజ పాలెం, చాకలి పాలెం కూడలిలో శనివారం సాయంత్రం మున్సిపల్ వాటర్ పైప్ లైన్ పగిలి నీరు రోడ్డుపై పారి మురికి కాలువ పాలవుతుందని స్థానికులు తెలిపారు. వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని వృధాగా పోతున్న మంచినీటి పైప్ లైన్ కు మరమ్మత్తులు చేపట్టాలన్నారు. పైప్ లైన్ పగలడం వలన ఇళ్లకు సరపరా అయ్యే తాగునీరు కలుషితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.