ప్రజల సమస్యల పరిష్కారమే మనందరి బాధ్యతని ప్రజల కోసం నిర్వహిస్తున్న విధులను సక్రమంగా నిర్వహించాలని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ అన్నారు. శుక్రవారం గుడ్లూరు తహసీల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రికార్డులను ఆమె పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ స్వర్ణ ఇతర రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు.