పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరేడు పంచాయతీలో పోలీసులు సోమవారం రాత్రి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో సమావేశమయ్యారు. సైబర్ నేరాలు, అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్న వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. శాంతి భద్రతలను కాపాడడంలో గ్రామస్తులు పూర్తిగా సహకారం అందించాలని కోరారు.