నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని వీరేపల్లి గ్రామ పరిధిలో మండల తహసిల్దార్ వి. లావణ్య ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభకు 69 అర్జీలు వచ్చినట్లు తహసిల్దార్ లావణ్య తెలిపారు. వాటన్నిటినీ పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ. భూములపై ఏ రకమైన సమస్యలు ఉన్న వెంటనే ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవాలన్నారు. వీలైనంత త్వరగా పరిష్కార మార్గం చూపుతామని తెలిపారు.