దగదర్తి: గ్రీవెన్స్ డేలో పాల్గొన్న మాలేపాటి

57చూసినవారు
దగదర్తి: గ్రీవెన్స్ డేలో పాల్గొన్న మాలేపాటి
దగదర్తి మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు, మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్రనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై వారు అధికారులతో మాట్లాడారు. అక్కడికి వచ్చిన ప్రజల కోసం సొంత నిధులతో మాలేపాటి సోదరులు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్