ముక్కోటి ఏకాదశి సందర్భంగా కావలి పట్టణం బృందావనం కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. కావలి నియోజకవర్గం ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, నియోజకవర్గం అభివృద్ధిలో నడవాలని స్వామి వారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.