రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ని, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి విజయవాడలో కలిసి కావలి నియోజకవర్గం లోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వెళ్లారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించవలసిందిగా మంత్రిని ఎమ్మెల్యే కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి కావలి నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.