కావలి 36వ వార్డులో విష జ్వరాలు.. స్పందించిన ఎమ్మెల్యే

50చూసినవారు
కావలి 36వ వార్డులో విష జ్వరాలు.. స్పందించిన ఎమ్మెల్యే
కావలిలోని 36వ వార్డు పెంకులు ఫ్యాక్టరీ గిరిజన కాలనీలో ప్రజలు విష జ్వరాలకి సతమతం అవుతున్నారు. 36వ వార్డు కన్వీనర్ తాత వెంకటేశ్వర్లు గౌడ్ ఈ విషయాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి తెలియజేశారు. స్పందించిన ఎమ్మెల్యే మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని అక్కడికి పంపించి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయించారు. మెడికల్ సిబ్బంది డోర్ టు డోర్ తిరిగి సర్వే చేసి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.

సంబంధిత పోస్ట్