కావలి పట్టణంలోని కలుగోలమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన గణేశుని నిమజ్జన కార్యక్రమం సోమవారం రాత్రి అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ విగ్రహానికి పూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. టిడిపి నేత మలిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.