దగదర్తి మండల తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే జరిగింది. ప్రజల పక్షాన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు అధికారులను కలిశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అని మాలేపాటి అన్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు అందించిన తోడ్పాటును మరిచిపోవద్దని అధికారులను కోరారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.