కనిగిరి రిజర్వాయర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. కోవూరు నియోజకవర్గంలో నీటి పారుదలలో తలెత్తుతున్న ఇబ్బందులను, కనిగిరి రిజర్వాయర్ ప్రస్తుత పరిస్థితిని అసెంబ్లీ దృష్టికి తీసుకువెళ్లారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే ఈ అంశాలను ప్రస్తావించారు. దేశానికి అన్నం పెట్టిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ సొంతమన్నారు.