వైసీపీ నేత సూరిబాబుపై కేసు నమోదు

71చూసినవారు
వైసీపీ నేత సూరిబాబుపై కేసు నమోదు
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని మహాత్మా గాంధీ నగర్ వినాయకుడి గుడి వద్ద వాహనదారుడు మహేష్ పై దాడి చేసి తల పగలగొట్టడంతో పాటు ఛాతిపై దాడి చేసిన నేరానికి సంబంధించి వైసీపీ నాయకుడు సిహెచ్ సూరిబాబుపై వేదాయపాలెం పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సిహెచ్ సూరిబాబు, వాహనదారు మహేష్ మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. మహేష్ ఫిర్యాదు చేయడంతో సూరిబాబు పై 125, 118(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్