నెల్లూరు నగరంలోని 13వ డివిజన్ హెచ్ పీ గౌడౌన్ సమీపంలోని 4 పార్కుల సెంటర్ వద్ద చీకట్లో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.
అనుమతి లేకుండా అధికార పార్టీ నేతల మద్దతుతో ఆదివారం రాత్రి ఇక్కడ నిర్మాణం చేపడుతున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని పలువురు స్థానికులతో పాటు వైసిపి నేతలు దీనిపై కమిషనర్ సూర్య తేజకు ఫిర్యాదు చేశారు. దీనిని వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం.