పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీసు వెల్ఫేర్ డే ను నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు మరియు ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న 19 మంది సిబ్బంది తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.