సమాధుల తోటలో పెద్దల పండుగ ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని, గత ఐదు సంవత్సరాలుగా వైసిపి ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. మంగళవారం సంక్రాంతి సందర్భంగా నెల్లూరు సమాధుల తోటలో నిర్వహించే పెద్దల పండుగను మంత్రి నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి పర్యవేక్షించారు.