నెల్లూరు: దివాలి విత్ మై భారత్ లో భాగంగా మార్కెట్ క్లీనింగ్

83చూసినవారు
నెల్లూరు: దివాలి విత్ మై భారత్ లో భాగంగా మార్కెట్ క్లీనింగ్
నెహ్రూ యువ కేంద్ర ఎన్ఎస్ఎస్ కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్ మార్కెట్ యాజమాన్యం సంయుక్త ఆధ్వర్యంలో.. దివాలి విత్ మై భారత్ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ క్లీనింగ్ మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా యువజన అధికారి ఏ మహేంద్ర రెడ్డి, డాక్టర్ సుబ్బారెడ్డి, మార్కెట్ కమిటీ సెక్రటరీ శ్రీనివాసులు పాల్గొన్నారు. ముందుగా స్వచ్ఛభారత్ మీద అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగరంలోని కూరగాయల మార్కెట్ నందు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్