తల్లిదండ్రులను గౌరవించి వారి ఆశీస్సులు వెంట ఉంటే సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్లొచ్చని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలో మంగళవారం బయ్యా వెంకటరమణయ్య సరోజనమ్మ మొమోరియల్ ట్రస్ట్ ద్వారా 1000 మందికి చీరలు పంపిణీ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. బయ్యా వాసు, రవిలను కోటంరెడ్డి అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని సూచించారు.