నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల నాయకుల సమావేశం ఆదివారం జరిగింది. సాగునీటి సంఘాల ఎన్నికలు, కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలను విస్తృతంగా చర్చించారు. ఇంఛార్జీ మంత్రి ఫరూక్, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపి విపిఆర్ పాల్గొన్నారు.