రాష్ట్రంలోని పురాతన దేవాలయాలను పునః నిర్మించి జీనొద్దారణ చేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తో కలిసి నెల్లూరు నవాపేటలోని ధర్మరాజు ఆలయం, శివాలయం లను పరిశీలించారు. దేవాదాయ, మున్సిపల్ అధికారులతో శివాలయ పునర్నిర్మాణం గురించి చర్చించారు. అనంతరం శివాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడారు.