అక్టోబర్ 3 నుంచి 12 వరకు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రుల ఉత్సావాల ఏర్పాట్లపై నగర కార్పొరేషన్ కమీషనర్ సూర్యతేజ ఇతర అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.