రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను.. నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. అదనపు కమిషనర్ శర్మద పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలన్నారు.