జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందజేస్తున్న వివిధ రకాల సేవలకు సంబంధించిన ఉచిత అత్యవసర హెల్ప్ లైన్ నంబర్ల వాల్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ వాల్ పోస్టర్ ను జిల్లాలోని ప్రతి అంగన్వాడీ సెంటర్లలో విధిగా ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ తో పాటు, ఐసిడిఎస్ పిడి హేనా సుజన్ పాల్గొన్నారు.