నెల్లూరు రూరల్ పరిధిలోని ధనలక్ష్మి పురం విబిఆర్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వెన్ను నరేంద్ర డిమాండ్ చేశారు. బుధవారం వారు మాట్లాడుతూ తల్లిదండ్రులను పరామర్శించామని, విద్యార్థి ఆత్మహత్య చేసుకునే అంత పరిస్థితులు ఏమీ లేవని తెలిపారు అన్నారు. చదువుపై ఒత్తిడి కారణంగానే విద్యార్థి చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అన్నారు.