పెన్నా బ్రిడ్జిపై నుంచి నెల్లూరు నగరానికి వస్తున్న మినీ ట్రక్ నుంచి సడెన్ గా పొగులు రావడంతో బ్రిడ్జి పైన వాహనదారులు, పాదాచారులు భయాందోళనకు గురయ్యారు. బుధవారం ఉదయం సిమెంటు లోడ్ తో వస్తున్న మినీ ట్రక్ నుంచి ఉన్నపళంగా శబ్దంతో పాటు, పొగలు రావడంతో ఏమైందో, ఏం జరుగుతుందోనని తీవ్ర ఆందోళన చెందారు. సుమారు అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.