నెల్లూరు జిల్లా సంగం బ్యారేజ్ సమీపంలో శనివారం అర్ధరాత్రి రెండు బైకులపై ఇద్దరు అనుమానాస్పదంగా వెళుతూ ఉండగా నైట్ బీట్ లో ఉన్న పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేశారు. దీంతో వారు ఒక బైక్ ని వదిలేసి మరో బైక్ పై పరారైనట్లు పోలీసులు తెలిపారు. వదిలేసిన బైకును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. వారు దొంగలు అనే ఊహాగానాలు వ్యాప్తి చెందడంతో సంఘం పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.