వచ్చేనెల 7న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని అధికారులందరూ సమన్వయంతో పనిచేసి నగరంలో నిమజ్జన వేడుకలను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్ సూచించారు. బుధవారం సాయంత్రం నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో వినాయక చవితి నిమజ్జన ఉత్సవాల నిర్వహణపై జేసీ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.