నెల్లూరు: కాలుష్య నియంత్రణ మండలి సభ్యురాలిగా చలంచర్ల విజయ

54చూసినవారు
నెల్లూరు: కాలుష్య నియంత్రణ మండలి సభ్యురాలిగా చలంచర్ల విజయ
నెల్లూరు జిల్లాలోని కాకుటూరులో ఉన్న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలోని మెరైన్ బయాలజీ విభాగంలో ఆచార్యగా, విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆచార్య చలంచర్ల విజయను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యురాలిగా భారత ప్రభుత్వం గురువారం విడుదల చేసిన గెజిట్‌లో ప్రకటించారు. ప్రొఫెసర్ విజయ మెరైన్ కాలుష్యం అంశంపై అనేక పరిశోధనలు చేస్తూ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించారు.

సంబంధిత పోస్ట్