అసంపూర్తిగా ఉన్న నాడు - నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సురేష్ తెలియజేశారు. నాయుడుపేట పట్టణంలోని ఎం.ఆర్.సీ కేంద్రంలో సూళ్లూరుపేట నియోజకవర్గ స్థాయి నాడు-నేడు పనులకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులతో జిల్లా విద్యాశాఖ అధికారి సురేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
మొదటి దశలో నాడు నేడు పథకం కింద ఎంపికైన పాఠశాలలో ఏ స్థాయిలో పనులు జరుగుతున్నాయి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న నాడు-నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాలని తెలియజేశారు. ఈ సమావేశంలో నాయుడుపేట మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు, వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు, నాడు-నేడుకు సంబంధించిన ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.