AP: రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పిడుగులతో పాటు గంటకు 30-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. మరో వైపు శనివారం విజయనగరంలో 7, శ్రీకాకుళంలో 6, మన్యంలో 5 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.