AP: కూటమి ప్రభుత్వం పెన్షన్ దారులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీలో అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో అక్రమాలను నియంత్రించేందుకు ఆధునికీకరించిన ఎల్-1 స్కానర్లను రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అందించేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు గ్రామ సచివాలయాల సిబ్బందికి పంపిణీ చేసింది.