యూపీలోని మీరట్‌లో ముస్కాన్ అనే మహిళ ప్రియుడితో కలిసి తన భర్త సౌరభ్‌ను హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే కేసుకి సంబంధించి షాకింగ్ వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తను చంపేసిన తర్వాత మార్చి 11న సాహిల్ పుట్టినరోజు సందర్భంగా ముస్కాన్- సాహిల్ శుక్లా హత్య తర్వాత సంబరాలు చేసుకున్నారు. ఈ తాజా వీడియోలో సాహిల్ ముస్కాన్ చేతిలోని కేక్ ముక్కను తిని ఆమెను ముద్దు పెట్టుకుంటున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.